Mahesh Babu: దసరాకి మహేశ్ ను సెట్స్ పైకి తీసుకెళుతున్న రాజమౌళి!

  • మహేశ్ తో రాజమౌళి సినిమా 
  • దక్షిణాఫ్రికా నేపథ్యంలో సాగే కథ
  • రాజమౌళి నుంచి తొలి అడ్వెంచరస్ థ్రిల్లర్
  • ఈలోగా త్రివిక్రమ్ మూవీని పూర్తిచేయనున్న మహేశ్
Mahesh Babu in Rajamouli movie

నిన్న మొన్నటి వరకూ 'ఆర్ ఆర్ ఆర్' హడావిడి సరిపోయింది. రాజమౌళి తాను అనుకున్న స్థానంలో 'ఆర్ ఆర్ ఆర్'ను నిలబెట్టారు. ఈ సినిమాతో మరోసారి ఆయన కొత్త రికార్డులను సెట్ చేశారు. ఆ రికార్డును టచ్ చేయడం ఇతర భాషా చిత్రాలకు కాస్త కష్టమైన పనే. అది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చును కూడా. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి నెక్స్ట్ మూవీపైనే ఉంది. తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందనీ, అయితే ఇది మల్టీ స్టారర్ సినిమా కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు కూడా. ఇక ఈ సినిమా దక్షిణాఫ్రిక అడవుల నేపథ్యానికి సంబంధించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గా కొనసాగనుందని ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

ఈ సినిమాను దసరాకి లాంచ్ చేయనున్నారనేది తాజా సమాచారం. ఈ లోగా అన్ని పనులను పూర్తిచేసుకుని, దసరా రోజున పూజా కార్యక్రమాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. ఆ వెంటనే పెద్ద గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆ లోగా త్రివిక్రమ్ సినిమాను మహేశ్ పూర్తిచేస్తాడన్న మాట.

More Telugu News