Gorantla Butchaiah Chowdary: జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్వ నాశ‌నం అయింది: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

gorantla fires on jagan
షార్ట్స్‌లో చూడండి
సీఎం జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్వ నాశ‌నం అయిందని టీడీపీ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. ఏపీలో ప్రాజెక్టుల ప‌నుల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయని ఆయ‌న విమ‌ర్శించారు. పోల‌వ‌రం ప‌నులు ఎందుకు జ‌ర‌గ‌డం లేదని, ఏపీలోని ప్రాజెక్టుల‌ వ‌ద్ద 144 సెక్ష‌న్ ఎందుకు అమ‌లు చేస్తున్నారు? అని ఆయ‌న నిల‌దీశారు. 

పోల‌వ‌రం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు సాధించ‌లేక‌పోతున్నారు? అని గోరంట్ల బుచ్చయ్చ చౌద‌రి ప్ర‌శ్నించారు. ఏపీలో గ‌త ప‌థ‌కాల‌కే పేర్లు మార్చి సంక్షేమానికి ఖ‌ర్చు చేస్తున్నామ‌ని అంటున్నారని ఆయ‌న అన్నారు. ప్రాజెక్టుల మీద వైసీపీ మంత్రుల‌ను ఏ మాత్రం అవ‌గాహ‌న లేదని ఆయ‌న చెప్పారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాష్ట్రంలోని ప‌రిస్థితుల గురించి క‌నీసం ఆలోచించ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేవ‌లం ఓట్ల కోసం మాత్ర‌మే జ‌గ‌న్ ఆలోచిస్తున్నార‌ని అన్నారు. ఇంత‌టి అవినీతి, అస‌మ‌ర్థ ముఖ్య‌మంత్రి దేశంలో ఎక్కడా లేర‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పారు.
Go Back to Shorts
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News