యశ్ అదరగొట్టేశాడు: రామ్ చరణ్

KGF 2 Movie Update
  • ఈ నెల 14న విడుదలైన 'కేజీఎఫ్ 2'
  • ప్రశంసలు కురిపిస్తున్న టాలీవుడ్ హీరోలు 
  • యశ్ గొప్పగా చేశాడంటూ కితాబు 
  •  టీమ్ లోని అందరికీ అభినందనలు
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్ 2' సినిమా రూపొందింది.  హోంబేలే ఫిలిమ్స్ బ్యానర్స్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తూ దూసుకుపోతోంది. రికార్డు స్థాయి వసూళ్లతో విస్మయులను చేస్తోంది. 

ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ 2' చూసిన టాలీవుడ్ హీరోలు ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆ  జాబితాలో చరణ్ చేరిపోయాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా, తాజాగా చరణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 "ముందుగా హోంబలే ఫిలిమ్స్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నాను. అలాగే నా బ్రదర్ ప్రశాంత్  నీల్ కి కూడా. ప్రశాంత్ నీల్ తన టేకింగ్ తో మరోసారి అద్భుతాలు చేశాడు. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ గొప్పగా ఉంది. పెర్ఫార్మెన్స్ తో ఆయన అదరగొట్టేశాడు. సంజయ్ దత్ ..  రవీనా టాండన్ .. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ తమ బెస్ట్ ఇచ్చారు. అలాగే శ్రీనిధి శెట్టి ..  అర్చన ఫెంటాస్టిక్ వర్క్ ను అందించారు. ఈ సినిమా సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ  కంగ్రాట్స్ " అంటూ రాసుకొచ్చాడు.
Go Back to Shorts
yash
Srinidhi Shetty
Sanjay Dutt
KGF 2 Movie

More Telugu News