Kodali Nani: మంత్రి ప‌ద‌వి కాదు.. ఎమ్మెల్యే ప‌దవి పోతేనే భ‌య‌ప‌డ‌తా: కొడాలి నాని

kodali nani comments on cabinet reshuffle
షార్ట్స్‌లో చూడండి
మంత్రి ప‌ద‌వి కోల్పోవ‌డంపై ఏపీ తాజా మాజీ మంత్రి, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా స్పందించారు. మంత్రి ప‌ద‌వి త‌న‌కు వెంట్రుక‌తో స‌మాన‌మ‌న్న నాని...  మాజీ మంత్రిగా ఉండే కంటే ఎమ్మెల్యేగా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డ‌తాన‌ని వ్యాఖ్యానించారు. మంత్రి ప‌ద‌వి పోతే త‌న‌కేమీ కాద‌న్న ఆయ‌న‌... ఎమ్మెల్యే ప‌ద‌వి పోతేనే భ‌య‌ప‌డతాన‌ని చెప్పుకొచ్చారు.

శ‌నివారం మీడియాతో మాట్లాడిన నాని.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డిని కోల్పోవ‌డంతోనే రాష్ట్రం రెండు ముక్కలైంద‌న్నారు. ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌ను వ‌దులుకుంటే ఏపీ స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఏపీ శ్రీలంక అవుతుందని విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
Go Back to Shorts
Kodali Nani
Gudivada MLA
YSRCP

More Telugu News