Tamilnadu: కొడ‌నాడు ఎస్టేట్‌ చోరీ కేసు... పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన శ‌శిక‌ళ‌

shashikala appears before tamilnadu police
షార్ట్స్‌లో చూడండి
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ గురువారం నాడు పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. జ‌య‌ల‌లిత‌కు చెందిన కొడ‌నాడు ఎస్టేట్‌లో గతంలో వాచ్‌మ‌న్‌ను హ‌త్య చేసిన గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఎస్టేట్‌లో చోరీకి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ద‌ర్యాప్తులో భాగంగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని శ‌శిక‌ళ‌కు ఇటీవ‌లే పోలీసుల నుంచి నోటీసులు వెళ్లాయి.

ఈ నోటీసుల‌కు అనుగుణంగా గురువారం కొడ‌నాడు ఎస్టేట్ చోరీ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) ముందు శ‌శిక‌ళ హాజ‌ర‌య్యారు. జ‌‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ఆమెకు చెందిన ఆస్తుల‌ను కొల్ల‌గొట్టేందుకే ఈ చోరీ జ‌రిగింద‌న్న‌ వాద‌న‌లు గ‌తంలో వినిపించాయి. అంతేకాకుండా అన్నాడీఎంకేకు చెందిన కీల‌క డాక్యుమెంట్లు కూడా ఈ చోరీ త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయాయ‌న్న వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
Tamilnadu
shashikala
AIADMK
Jayalalitha

More Telugu News