'అంటే .. సుందరానికీ' అంతకుమించి అన్నట్టుగా ఉంటుంది: నాని

Ante Sundaraniki movie update
  • వినోదప్రధానంగా సాగే 'అంటే .. సుందరానికీ'
  • నాని సరసన నాయికగా నజ్రియా 
  • దర్శకుడిగా వివేక్ ఆత్రేయ 
  • జూన్ 10వ  తేదీన సినిమా విడుదల
నాని హీరోగా వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా కథానాయికగా పరిచయమవుతోంది. జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. "అంటే .. సుందరానికీ' సినిమా నాకు చాలా చాలా స్పెషల్ సినిమా. ఎందుకు అనేది .. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా .. అప్పుడు చెబుతాను. ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా మేమంతా కలిసి ఈ సినిమాకి పనిచేశాము. ఈ సినిమాను వివేక్ తప్ప ఇంకా ఎవరూ తీయలేరు. ఈ కథను ఆయన చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేరు.

నా సినిమా అనే కాదు ఇకపై వివేక్ ఏ సినిమా తీసినా ఫస్టు డేనే మార్నింగ్ షో చూస్తాను. నజ్రియాతో తెలుగు సినిమా చేయించాలని ఇంతకుముందు చాలామంది ప్రయత్నించారుగానీ కుదరలేదు. ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించడం విశేషం. టీజర్ కి రెండు రెట్లు ట్రైలర్ ఉంటుంది .. దానికి పది రెట్లు సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Nani
Nazriya
Vivek Athreya
Ante Sundaraniki Movie

More Telugu News