తన తల్లి గురించి భావోద్వేగంగా స్పందించిన మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన తల్లి గురించి భావోద్వేగంగా స్పందించిన మహేశ్ బాబు

Mahesh Babu emotional post on his mothers birthday
  • చిన్నప్పుడు తన తల్లి వద్ద ఎక్కువగా పెరిగిన మహేశ్
  • ఈరోజు మహేశ్ తల్లి పుట్టినరోజు
  • నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానన్న మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తన తల్లి ఇందిరాదేవి అంటే అంతులేని ప్రేమ. చిన్న తనంలో తన తండ్రి కృష్ణ షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు మహేశ్ ఎక్కువగా తన తల్లి, అమ్మమ్మ ప్రేమానురాగాల మధ్య పెరిగాడు. అమ్మమ్మతో కూడా మహేశ్ చాలా అన్యోన్యంగా ఉండేవాడు. 

ఈరోజు మహేశ్ తల్లి ఇందిర పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా మహేశ్ భావోద్వేగంతో కూడిన పోస్టును పెట్టాడు. 'హ్యాపీ బర్త్ డే అమ్మా. నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్కరోజు సరిపోదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా' అని ట్వీట్ చేశాడు.
Mahesh Babu
Tollywood
Mother
Birthday

More Telugu News