Bandla Ganesh: మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లోకి లాగుతున్నావ్?: విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ తీవ్ర వ్యాఖ్యలు

Bandla Ganesh fires on Vijayasai Reddy for commenting Kamma caste
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించారు. 

'వైజాగ్ ని కుదిపేసిన తుపాను నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేశావ్ విష సాయి. అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్బాజీవి. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం విజయసాయి. 

కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేము. నీవు విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నావు. ఇది ప్రపంచానికి తెలుసు. పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు. అది నీకు మంచిది కాదు. టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారికి టికెట్ ఇచ్చారు? 

జగన్ గారు... ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు. నాకు కుల పిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తాను. ప్రతి కులాన్ని గౌరవిస్తాను. కమ్మ వారిని తిట్టడాన్ని తట్టుకోలేక పోతున్నా. నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు. దయచేసి కులాన్ని తిట్టకు. ఇదేనా నీ సంస్కారం?  నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు. ఎంపీగా ఉన్నానని, అధికారంలో ఉన్నానని కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు. కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రకి నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు. 

నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు. కానీ కులాన్ని కాదు. నిన్ను జైలుకు పంపింది కమ్మ వారు కాదు. త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి. ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు. అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా. చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకో. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కో. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు. 

నాకు వైయస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవం. కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం. నువ్వు పెద్ద దరిద్రానివి. మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లోకి లాగుతున్నవ్? కేసీఆర్ ని చూసి నేర్చుకో. అన్ని కులాల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అయ్యా ఆంధ్రకి పట్టిన అష్ట దరిద్రమా, నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది.

మీకు కులం నచ్చకుంటే... కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి. చంద్రబాబును, టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాడిని... కానీ టీడీపీ కాదు' అంటూ విజయసాయిపై బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు.
Go Back to Shorts
Bandla Ganesh
Pawan Kalyan
Janasena
Vijayasai Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News