Vikram: విక్రమ్ హీరోగా మురుగదాస్ మూవీ!

Vikram in Murugadoss Movie
షార్ట్స్‌లో చూడండి
తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలను చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేపేరు విక్రమ్. పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా ఆయన సిద్ధంగా ఉంటారు. 'అపరిచితుడు' .. 'ఐ' సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి విక్రమ్ చేసిన 'మహాన్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది.

అప్పటి నుంచి ఆయన సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. వాటిలో మే 26వ తేదీన 'కోబ్రా' విడుదల కానుంది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో చేసిన 'పొన్నియిన్ సెల్వన్' లైన్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే విక్రమ్ మరో సినిమాను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. 

ఇటీవలే మురుగదాస్ .. విక్రమ్ ను కలిసి ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. ఆ సినిమా చేయడానికి వెంటనే ఆయన ఒప్పుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
Vikram
Murugadoss
Kollywood

More Telugu News