తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ పెళ్లి ఫొటోలపై కత్రినా కైఫ్ స్పందన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ పెళ్లి ఫొటోలపై కత్రినా కైఫ్ స్పందన!

Katrina Kaif reacts on ex boyfriend Ranbir Kapoor s wedding pics
  • దాదాపు ఆరేళ్లు రిలేషన్ షిప్ లో ఉన్న కత్రిన, రణబీర్ కపూర్
  • కొన్ని కారణాల వల్ల విడిపోయిన జంట
  • రణబీర్, అలియా భట్ కు శుభాకాంక్షలు తెలిపిన కత్రిన
బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణబీర్ కపూర్ లు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ముంబైలోని రణబీర్ నివాసంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త దంపతులకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

మరోవైపు రణబీర్ కపూర్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. ఇన్స్టాగ్రామ్ లో అలియా భట్ పోస్ట్ చేసిన పెళ్లి ఫొటోపై స్పందిస్తూ, 'ఇద్దరికీ శుభాకాంక్షలు. ఇద్దరూ అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలి' అని విషెస్ తెలిపింది. కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ ఇద్దరూ దాదాపు 6 ఆరేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఒకరికొకరు దూరమయ్యారు. అనంతరం గత డిసెంబర్ లో హీరో విక్కీ విశాల్ ను కత్రిన పెళ్లాడింది. ఇప్పుడు అలియాను రణబీర్ పెళ్లి చేసుకున్నాడు.
Katrina Kaif
Ranbir Kapoor
Alia Bhatt
Wedding

More Telugu News