అంబేద్కర్‌కు కేటీఆర్ నివాళి.. తెలంగాణకు బాట వేసిన నేతగా కీర్తించిన వైనం
- అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేటీఆర్ నివాళి
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తోనే తెలంగాణ ఏర్పాటు
- తెలంగాణకు బాట వేసింది అంబేద్కరేనన్న కేటీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యేందుకు అంబేద్కర్ బాట వేశారని, ఆయన రాసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. అంతేకాకుండా జీవితం సుదీర్ఘంగా ఉండేదానికంటే గొప్పగా ఉండటమే మేలంటూ అంబేద్కర్ చెప్పిన మాటను కూడా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.