మ‌హేశ్ బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస‌ల వ‌ర్షం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌హేశ్ బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస‌ల వ‌ర్షం

yrscp mp vijaysai reddy praises mahesh babu
  • 30 మంది చిన్నారుల గుండె ఆప‌రేష‌న్ల‌కు మ‌హేశ్ బాబు సంక‌ల్పం
  • ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ సాయిరెడ్డి ట్వీట్
  • మ‌హేశ్ బాబును రియల్ హీరో అంటూ కీర్తించిన వైనం
వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి.. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ వేదిక‌పై మ‌హేశ్ బాబును అభినందిస్తూ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. మ‌హేశ్ బాబును రియ‌ల్ హీరోగా కీర్తిస్తూ స‌ద‌రు పోస్ట్‌లో సాయిరెడ్డి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

వ‌రల్డ్ హెల్త్‌డేను పుర‌స్క‌రించుకుని మ‌హేశ్ బాబు 30 మంది చిన్నారుల‌కు గుండె శ‌స్త్రచికిత్స‌లు చేయించేందుకు ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన సాయిరెడ్డి.. మ‌హేశ్ బాబు ద‌యాగుణం క‌లిగిన వార‌ని కీర్తించారు. ప్ర‌జ‌ల మెరుగైన జీవితాల కోసం రియ‌ల్ హీరోలు ఎలాంటి స్వార్థం లేకుండా ప‌నిచేస్తారంటూ మ‌హేశ్ బాబును సాయిరెడ్డి కొనియాడారు. 
Vijayasai Reddy
Mahesh Babu
WorldHealthDay
YSRCP

More Telugu News