కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవు: గుడివాడ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- అందరమూ రాజీనామా చేశామన్న నాని
- 11న కొత్త కేబినెట్ ప్రమాణం చేస్తుందని వ్యాఖ్య
- జగన్ ఆదేశాల మేరకే రాజీనామాలన్న కొడాలి
ఈ సందర్భంగా కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో స్థానముంటుందా? అన్న ప్రశ్నకు స్పందించిన నాని... కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని వ్యాఖ్యానించారు. కొత్త కేబినెట్‌లో తనకు స్థానంపై అవకాశాలు తక్కువేనని ఆయన చెప్పారు. కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేరకు మంత్రివర్గంలోని అందరం రాజీనామా చేశామని చెప్పారు.
ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ చెప్పారన్నారు. మంత్రి పదవులకు తాము రాజీనామా చేస్తుంటే.. జగన్ ఎక్కువగా బాధపడినట్టుగా కనిపించిందని, అయితే తాము ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని, మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని నాని వ్యాఖ్యానించారు.