రామ్ గోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ కేసు.. వర్మకు షాకిచ్చిన కోర్టు!

Court orders to stop release of Ram Gopal Varma movie
  • వర్మ తనకు రూ. 5.29 కోట్లు ఇవ్వాలన్న నట్టి కుమార్
  • ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలన్న కండిషన్ ను తుంగలో తొక్కాడని పిటిషన్
  • వర్మ సినిమా విడుదలను ఆపేసిన కోర్టు
ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ఆయన తాజా చిత్రం 'డేంజరస్ (మా ఇష్టం)' విడుదలను ఆపేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, వర్మపై సినీ నిర్మాత నట్టికుమార్ పిటిషన్ వేశారు. వర్మ తనకు రూ. 5.29 కోట్లు ఇవ్వాలని... ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలనే ఒప్పందం తమ మధ్య ఉందని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం తను డబ్బులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు వర్మ తాజా చిత్రం విడుదలను ఆపేయాలని తీర్పును వెలువరించింది. వాస్తవానికి ఈ చిత్రం రేపు విడుదల కావాల్సి ఉంది.
Go Back to Shorts
Ram Gopal Varma
Natti Kumar
Tollywood

More Telugu News