Adimulapu Suresh: ఆయన కోసం తల కోసుకోవడానికైనా సిద్ధమే: మంత్రి ఆదిమూలపు సురేశ్

I am ready to cut my head for Jagan says Adimulapu Suresh
షార్ట్స్‌లో చూడండి
ఇద్దరు, ముగ్గురు మినహా ఏపీ మంత్రులంతా రాజీనామా చేయబోతున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవిని నిలుపుకునేది ఎవరు? కొత్తగా అవకాశం ఎవరెవరికి దక్కబోతోంది? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. తమకు మరోసారి అవకాశం రాకపోవచ్చని ఇప్పటికే చాలా మంది మంత్రులు మానసికంగా సిద్ధమయ్యారు. 

ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రిగా తనకు సీఎం జగన్ గొప్ప అవకాశం ఇచ్చారని అన్నారు. జగన్ నాయకత్వంలో పని చేయడం గొప్ప అనుభవమని చెప్పారు. సీఎం లక్ష్యాలకు అనుగుణంగా, ఆయన అంచనాలను అందుకునే విధంగా శాయశక్తులా పని చేశానని తెలిపారు. జగన్ కోసం తన తల కోసుకోవడానికైనా సిద్ధమని అన్నారు. 

గత పాలకులు విద్యను కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం చేశారని సురేశ్ విమర్శించారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనేని జగన్ విధానమని అన్నారు. విద్యారంగంలో సమూల మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. మూడేళ్లలో విద్యారంగంపై 76 సమీక్షలను నిర్వహించారని చెప్పారు. తనకు జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా మరింత ఉత్సాహంగా పని చేస్తానని అన్నారు.
Go Back to Shorts
Adimulapu Suresh
Jagan
YSRCP

More Telugu News