ఆర్జీవీ వెన‌క‌డుగు!.. డేంజ‌ర‌స్ విడుద‌ల‌ను వాయిదా వేసిన డైరెక్ట‌ర్‌!
Add ap7am to your home Screen

ఆర్జీవీ వెన‌క‌డుగు!.. డేంజ‌ర‌స్ విడుద‌ల‌ను వాయిదా వేసిన డైరెక్ట‌ర్‌!

ramgopal varma pospones his new movie dangerous
  • డేంజ‌ర‌స్ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు పీవీఆర్‌, ఐనాక్స్ తిర‌స్క‌ర‌ణ‌
  • అదే బాట‌లో మ‌రికొన్ని సినిమా థియేట‌ర్లు
  • స్వ‌లింగ సంప‌ర్కం నేప‌థ్యంలో తెర‌కెక్కిన డేంజ‌ర‌స్‌
  • త్వ‌ర‌లోనే మ‌రో తేదీని ప్ర‌క‌టిస్తాన‌న్న రాంగోపాల్ వ‌ర్మ‌
ప్ర‌ముఖ దర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ వెన‌క‌డుగు వేశారు. త‌న తాజా చిత్రం డేంజ‌ర‌స్ విడుద‌ల‌ను ఆయ‌న వాయిదా వేశారు. ఇందుకు గ‌ల కార‌ణాన్ని కూడా వివ‌రిస్తూ కాసేప‌టి క్రితం వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. డేంజ‌ర‌స్ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది.

స్వ‌లింగ సంప‌ర్కం నేప‌థ్యంలో వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మరికొన్ని థియేట‌ర్లు కూడా ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందుకు రాలేద‌ట‌. ఈ కార‌ణంగానే చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు వర్మ ప్ర‌క‌టించారు. త‌న‌కూ, త‌న చిత్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పోరాటం చేస్తాన‌ని చెప్పిన వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే చిత్రం విడుద‌ల‌కు మ‌రో తేదీని ప్ర‌క‌టిస్తాన‌ని పేర్కొన్నారు.
Ram Gopal Varma
Dangerous
PVR Cinemas
INAX Cinemas

More Telugu News