చైతూ 22వ సినిమా నుంచి అధికారిక ప్రకటన!
- 'బంగార్రాజు'తో హిట్ కొట్టిన చైతూ
- రిలీజ్ కి రెడీగా 'థ్యాంక్యూ'
- సెట్స్ పైకి 22వ సినిమా
- దర్శకుడిగా వెంకట్ ప్రభు
ఈ సినిమా తరువాత చైతూ .. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా రూపొందించనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కాంబినేషన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా.
తమిళంలో దర్శకుడిగా వెంకట్ ప్రభుకి మంచి పేరు ఉంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. అయితే అధికారికంగా చెప్పవలసి ఉంది. తెలుగులో పూజ హెగ్డే తన ఫస్టు సినిమానే చైతూతో చేసిన సంగతి తెలిసిందే.