మీకు ప్రభాస్ కొత్త సినిమాలో నటించాలనుందా... అయితే ఇది చదవండి!
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రభాస్
- 'ప్రాజెక్ట్ కే' కోసం ఆడిషన్స్
- నేడు, రేపు ఎంపికలు
- హైటెక్ సిటీలోని ఫీనిక్స్ ఎరీనా వేదికగా సెలెక్షన్స్
- ప్రకటన ఇచ్చిన వైజయంతీ మూవీస్
అన్ని వయసుల వారు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని వెల్లడించింది. నటులు, మోడల్స్, డ్యాన్సర్లు, మ్యూజిషియన్లు, మార్షల్ ఆర్టిస్ట్స్, పెర్ఫార్మెర్స్ ఎవరైనా రావొచ్చని పేర్కొంది. తమ ప్రతిభను ఓ 30 సెకన్ల పాటు ప్రదర్శించేలా సన్నద్ధమై రావాలని పిలుపునిచ్చింది. హైదరాబాదులోని ఫీనిక్స్ ఎరీనా (టీఎస్ఐఐసీ పార్క్-హైటెక్ సిటీ) వేదికగా ఆడిషన్స్ జరుగుతాయని వైజయంతీ మూవీస్ తన ప్రకటనలో వెల్లడించింది.
ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఈ నెల 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.