CM Jagan: రాష్ట్ర ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

CM Jagan conveys Ugadi wishes
షార్ట్స్‌లో చూడండి
రేపు తెలుగు సంవత్సరాది ఉగాది. శుభకృత్ నామ సంవత్సరం ఆగమనం సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల ఉగాది వచ్చిందని, శుభకృత్ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సకల సంపదలు, ఆనందాలు వెల్లివిరియాలని అభిలషించారు. 

శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండి రైతులకు మేలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, పల్లె, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఇల్లు కళకళలాడాలని పేర్కొన్నారు.
Go Back to Shorts
CM Jagan
Ugadi
Shubhakruth
Andhra Pradesh

More Telugu News