రామ్ ఈ సారి హిట్టు కొట్టేలానే ఉన్నాడే!

The Worrierr Movie Update
  • రామ్ హీరోగా 'ది వారియర్'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రామ్ 
  • కథానాయికగా కృతి శెట్టి
  • జులై 14న విడుదల  
టాలీవుడ్ లో లవర్ బాయ్ గా రామ్ కి మంచి క్రేజ్ ఉంది. అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన మాత్రం మాస్ ఇమేజ్ ను ఎక్కువగా కోరుకుంటున్నాడు. అందువల్లనే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను చేశాడు. మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసి తన ముచ్చట తీర్చుకున్నాడు.

ఆ తరువాత ఆయన ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన చేస్తూనే 'రెడ్' చేశాడు. ఇటు క్లాస్ గాను .. అటు మాస్ గాను ప్రేక్షకులను మెప్పించాలని ట్రై చేశాడు. కానీ ఆయన ప్రయత్నం సక్సెస్ కాలేదు. దాంతో కొంత టైమ్ తీసుకుని మరీ ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'ది వారియర్' టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. 

శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ బాణీలను అందించాడు. పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా కృతి శెట్టి పలకరించనుంది. తెలుగుతో పాటు తమిళంలోను జూలై 14న ఈ సినిమా విడుదల కానుంది. రామ్ లుక్ చూస్తుంటే మాత్రం ఈ సారి హిట్టు కొట్టేలానే కనిపిస్తున్నాడు.
Go Back to Shorts
Ram
Krithi Shetty
Lingu Samy
Warriorr Movie

More Telugu News