తమిళ హీరో శింబు కారు ఢీకొని గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి

తమిళ హీరో శింబు కారు ఢీకొని గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి

Old man who was hit by Tamil Hero Simbu car died in hospital
  • చెన్నైలో ఈ నెల 18న రోడ్డు ప్రమాదం
  • శింబు తండ్రి ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఘటన
  • రోడ్డు పక్కన దివ్యాంగుడికి తీవ్ర గాయాలు
  • నిన్న కన్నుమూత..శింబు కారు డ్రైవర్ అరెస్ట్
ఈ నెల 18న చెన్నైలో తమిళ హీరో శింబు కారు ఢీకొని ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో కారులో శింబు తండ్రి టి.రాజేంద్రన్ ఉన్నారు. తన కుమారుడికి చెందిన వాహనంలో ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా, రోడ్డు పక్కన ఉన్న దివ్యాంగుడైన వృద్ధుడిని ఆ కారు ఢీకొట్టింది. 

వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించిన టి.రాజేంద్రన్ ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ ను కూడా వృద్ధుడి వెంట ఆసుపత్రికి పంపించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆ వృద్ధుడు... పరిస్థితి విషమించడంతో నిన్న కన్నుమూశారు. ప్రమాదానికి కారకుడైన శింబు కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ రోడ్డు ప్రమాదం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Old Man
Death
Simbu
Car
T.Rajendran

More Telugu News