జగన్ కు రాజీనామా లేఖలు పంపిన నాలుగు స్మార్ట్ సిటీల ఛైర్మన్లు
- విశాఖ, తిరుపతి, ఏలూరు, కాకినాడ స్మార్ట్ సిటీ ఛైర్మన్ల రాజీనామా
- ఇటీవలే స్మార్ట్ సిటీలను ప్రకటించిన ప్రభుత్వం
- ఇంతవరకు నిధులు, కార్యాలయం, సిబ్బందిని కేటాయించని వైనం
ఇటీవలే ఈ నాలుగు నగరాలను జగన్ సర్కారు స్మార్ట్ సిటీలను చేసింది. ఈ సిటీలకు ఛైర్మన్లను నియమించింది. అయితే వీటికి కార్యాలయాలు, సిబ్బంది, నిధులను మాత్రం ఇంత వరకు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో వీరు నలుగురు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.