ది కశ్మీర్ 'ఫైల్స్'పై కేసీఆర్ విసుర్లు!
- ది కశ్మీర్ ఫైల్స్ ఎవరు కోరారు?
- అసలు అందులో ఏముంది?
- ఇరిగేషన్ ఫైల్స్, ఎకనమిక్ ఫైల్స్ ఉండాలి
- టీఆర్ఎస్ఎల్పీ భేటీ తర్వాత మీడియాతో కేసీఆర్
సోమవారం నాడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆసరాగా చేసుకుని కూడా తనదైన శైలి దాడి కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . "ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఏముంది? అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వం ఉన్నట్లైతే.. ఇరిగేషన్ ఫైల్స్, ఎకనమిక్ ఫైల్స్ ఉండాలి. ద కశ్మీర్ ఫైల్స్ ను ఎవరు కోరారు? ఈ చిత్రాన్ని ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఢిల్లీలో కొందరు కశ్మీరీ పండిట్లు చెబుతున్నారు. ఇప్పటిదాకా తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని కూడా వారు ఆరోపిస్తున్నారు" అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.