నెట్ ఫ్లిక్స్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కామెడీ షోలు
Add ap7am to your home Screen

నెట్ ఫ్లిక్స్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కామెడీ షోలు

Zelensky comedy series will telecast in Netflix
  • రాజకీయాల్లోకి రాకముందు టీవీ షోలు చేసిన జెలెన్ స్కీ
  • అనేక సినిమాల్లోనూ నటించిన వైనం
  • బాగా పేరు తెచ్చిన 'సర్వెంట్ ఆఫ్ ద పీపుల్' 
  • అందులో దేశాధ్యక్షుడిగా నటించిన జెలెన్ స్కీ
రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ శాంతి, ధైర్యం, దేశభక్తి వంటి అంశాలకు ప్రతీకగా నిలుస్తున్నారు. జెలెన్ స్కీ ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలకు ఓ హీరో. వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి రాకముందు కమెడియన్. లా చదివిన జెలెన్ స్కీ ఓ రష్యా టీవీ షోలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం తన చిన్ననాటి స్నేహితులతో కలిసి క్వర్టాల్-95 అనే ఎంటర్టయిన్ మెంట్ సంస్థను స్థాపించారు. టీవీ షోలు, కార్టూన్లనే కాదు, ఈ సంస్థ సినిమాలు కూడా నిర్మించింది. 

ఇక అనేక వినోద కార్యక్రమాల్లో జెలెన్ స్కీ కమెడియన్ గా నటించారు. అంతేకాదు, పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. కాగా, రష్యా దురాక్రమణ నేపథ్యంలో జెలెన్ స్కీ ఇప్పుడు వరల్డ్ వైడ్ పాప్యులారిటీ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. జెలెన్ స్కీ గతంలో నటించిన అనేక టీవీ షోలు, కామెడీ సిరీస్ లను మళ్లీ ప్రసారం చేయనుంది. 

ముఖ్యంగా, జెలెన్ స్కీ నటించిన 'సర్వెంట్ ఆఫ్ ద పీపుల్' సిరీస్ ను ప్రసారం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో జెలెన్ స్కీ దేశాధ్యక్షుడి పాత్ర పోషించడం విశేషం. ఈ సెటైరికల్ కామెడీ సిరీస్ 2015లో వచ్చింది. ఇందులో జెలెన్ స్కీ ఓ టీచర్ నుంచి దేశాధ్యక్షుడిగా మారడం చూడొచ్చు.
Volodymyr Zelensky
Comedy Series
Netflix
Servent Of The People
Ukraine
Russia

More Telugu News