ఇప్పటంలో ప్రారంభమైన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ... హాజరైన పవన్ కల్యాణ్, నాదెండ్ల, నాగబాబు
- జనసేన పార్టీకి 8 ఏళ్లు పూర్తి
- నేడు ఆవిర్భావ దినోత్సవం
- ఇప్పటం గ్రామం వద్ద సభ ఏర్పాటు
- భారీగా తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు
ప్రస్తుతం సభలో జనసేన పార్టీ నేతలు ప్రసంగిస్తున్నారు. పవన్ ప్రసంగం కోసం జనసైనికులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగిన పలు పరిణామాలపై తన సమాధానం ఈ సభ ద్వారా తెలియజేస్తానని పవన్ పేర్కొనడం తెలిసిందే.