అనుమతి వచ్చేసింది!.. ఇప్పటంలోనే జనసేన ఆవిర్భావ సభ!
- మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే పర్మిషన్
- వేదికకు దామోదరం సంజీవయ్య పేరు
- కీలకమైన కార్యాచరణ ప్రకటించే అవకాశం
అయితే ఎట్టకేలకు ఇప్పటం పరిధిలోనే పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకునేలా జనసేనకు ఏపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు అనుమతి నిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉంటే.. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభా వేదికగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కీలకమైన కార్యాచరణ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.