YS Jagan: సీఎం జ‌గ‌న్‌కు మ‌హేశ్ బాబు థ్యాంక్స్‌!

cine hero mahesh babu thanks to ap cm ys jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సినిమా టికెట్ల రేట్ల‌ను స‌వరిస్తూ కొత్త జీవో ఇచ్చినందుకు గాను సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్యవాదాలు తెలుపుకుంటున్న‌ట్లుగా మ‌హేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యం ద్వారా తెలుగు సినీ ప‌రిశ్రమ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌ ప‌రిష్క‌రించేసిన‌ట్టేన‌ని మ‌హేశ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌, ఏపీ సీఎం మ‌ధ్య వార‌ధిలా వ్య‌వ‌హ‌రించిన ఏపీ మంత్రి పేర్ని నానికి కూడా కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన మ‌హేశ్ బాబు.. మున్ముందు ఏపీ ప్ర‌భుత్వం, సినీ ప‌రిశ్ర‌మ మ‌ధ్య మ‌రింత మెరుగైన సంబంధాలు నెల‌కొనేలా ముందుకు సాగుతామ‌ని కూడా పేర్కొన్నారు. సోమ‌వారం ఏపీ స‌ర్కారు నుంచి జీవో రాగా.. మంగ‌ళ‌వారం మ‌హేశ్ బాబు దానిని ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
YS Jagan
Tollywood
Mahesh Babu

More Telugu News