నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలి: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలి: రోజా

Roja fires on Chandrababu
  • మహిళలంతా జగన్ కు జై కొడుతున్నారు
  • మహిళా సాధికారతకు అవకాశం కల్పించారు
  • నారావారి నరకాసుర పాలనను మహిళలంతా గమనించారన్న రోజా 
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. మహిళలు అడక్కుండానే జగన్ ఎంతో చేస్తున్నారని కొనియాడారు.

మహిళలంతా జగన్ కు జై కొడుతున్నారని... ఆ సౌండ్ కు చంద్రబాబు గుండెల్లో రీసౌండ్ రావాలని చెప్పారు. మహిళా సాధికారతకు జగన్ అవకాశం కల్పించారని అన్నారు. ఎందరో నాయకులు వచ్చిపోయారని... వారెవరూ సాధించలేని దాన్ని జగన్ చేసి చూపించారని చెప్పారు. 

అసలు జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు టీమ్ కు లేదని అన్నారు. నారావారి నరకాసుర పాలనను రాష్ట్రంలోని మహిళలందరూ గమనించారని చెప్పారు. మహిళలపై దాడి చేసిన చరిత్ర టీడీపీ నేతలదని రోజా దెప్పిపొడిచారు. 
Roja
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News