విడాకుల తర్వాత దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నా: సమంత

Faced tough time after divorce says Samantha
  • నా జీవితంపై ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి
  • జాగ్రత్తగా రూపొందించుకున్న ప్రణాళికలు శిథిలమైపోయాయి
  • ఏది సురక్షితంగా అనిపిస్తుందో దాన్ని స్వీకరిస్తానన్న సమంత 
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్యలు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వారిద్దరూ విడిపోతున్న వార్తతో సినీ అభిమానులు షాక్ కు గురయ్యారు. తాజాగా సమంత దీనిపై స్పందిస్తూ... నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తాను అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపింది. 

2021లో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాల తర్వాత తన జీవితంలో ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయని... ఎందుకంటే తాను ఎంతో జాగ్రత్తగా రూపొందించుకున్న ప్రణాళికలన్నీ శిథిలమైపోయాయని చెప్పింది. భవిష్యత్తులో తనకు ఏదైతే సురక్షితంగా అనిపిస్తుందో దాన్ని స్వీకరిస్తానని తెలిపింది. 

2010లో వచ్చిన 'ఏం మాయ చేశావే' చిత్రంలో సమంత, నాగచైతన్య కలిసి నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్ లో ఉన్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న తర్వాత ఏం జరిగిందో కానీ... ఇద్దరూ అందరికీ షాకిస్తూ విడిపోయారు.
Go Back to Shorts
Samantha
Tollywood
Naga Chaitanya
Divorce

More Telugu News