'ది వారియర్' నుంచి ఆది పినిశెట్టి ఫస్టు లుక్!
- రామ్ హీరోగా 'ది వారియర్'
- కథానాయికగా కృతి శెట్టి
- ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
'మహాశివరాత్రి' సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఆది పినిశెట్టి ఫస్టులుక్ ను వదిలారు. ఆది పినిశెట్టి పాత్రను ఎంత డిఫరెంట్ గా డిజైన్ చేశారు .. ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండనుందనేది ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. ఆయన విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందన్నది ఆయన లుక్ చెప్పేస్తోంది.
రామ్ మొదటిసారిగా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 'రెడ్' సినిమా రిజల్ట్ తో డీలాపడిన రామ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటితో చేయనున్న సంగతి తెలిసిందే.