Vijay Sai Reddy: ఈ సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్ మెయిల్ చేయొచ్చో నేర్పించడానికా?: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp
షార్ట్స్‌లో చూడండి
సర్పంచుల అవగాహన సదస్సులో టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు వారికి ప‌లు సూచ‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం విధిస్తోన్న ప‌న్నులు వంటి ప‌లు అంశాల‌పై చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, చెత్తపన్ను వసూలు చేయబోమని పంచాయతీలు తీర్మానం చేయాలని సూచించ‌డం వంటి అంశాల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.

'చంద్రబాబు గారు సర్పంచుల సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్ మెయిల్ చేయొచ్చో నేర్పించడానికా? మీ హయాంలో ఉపాధి హమీ పనుల దోపిడీ వివరాలు కేంద్రం దగ్గర ఉన్నాయి. దొంగే దొంగ అని అరవడం కొత్తకాదు గదా మీకు. ‘నరేగా’లో 7 వేల కోట్ల అవినీతి జరిగితే ఫిర్యాదు చేయకుండా ఎవరు ఆపారు మిమ్మల్ని?' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News