'అంటే .. సుందరానికీ' రిలీజ్ డేట్ ఖరారు!
- నాని తాజా చిత్రంగా 'అంటే సుందరానికీ'
- కథానాయికగా నజ్రియా పరిచయం
- కీలకమైన పాత్రలో నదియా
- జూన్ 10వ తేదీన విడుదల
సుందరానికి చిన్నప్పటి నుంచి గండాలు ఉన్నాయనే భయంతో అతనితో ఎప్పుడూ ఏదో ఒక హోమం చేయిస్తూ ఉంటారు. అతనేమో ఇక హోమాలు చేయడం తన వల్ల కాదని విసుక్కుంటూ ఉంటాడు. ఈ వీడియో ద్వారా ఈ సినిమా టీమ్ నానీకి శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదు, ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు.
వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో కథానాయికగా నజ్రియా నజీమ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. నరేశ్ .. రోహిణి .. నదియా .. సుహాస్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా నాని 'దసరా'ను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.