పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'కు చీఫ్ గెస్ట్ గా కేటీఆర్
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'కు చీఫ్ గెస్ట్ గా కేటీఆర్

KTR is chief guest for Pawan Kalyans Bheemoa Nayak pre release event
  • విడుదలకు సిద్ధమవుతున్న 'భీమ్లా నాయక్'
  • ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా కేటీఆర్
  • సోమవారం పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్
జనసేనాని పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'భీమ్లా నాయక్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది మరోవైపు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం జరగనుంది. హైదరాబాదులోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తున్నారు.

ఈ వార్తతో ఇటు పవన్ అభిమానులు, అటు టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతాన్ని అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Pawan Kalyan
Janasena
Bheemla Nayak
KTR
TRS
Pre Release Event

More Telugu News