Pawan Kalyan: కేసీఆర్ గారు రాజ‌కీయ పోరాట యోధుడు.. ఆయ‌న‌కు ఆయ‌నే సాటి: ప‌వ‌న్ క‌ల్యాణ్

pawan wishes to kcr
షార్ట్స్‌లో చూడండి
నేడు 68వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప వాక్ప‌టిమ, ముందు చూపు క‌లిగిన రాజ‌కీయ పోరాట యోధుడు కేసీఆర్ అంటూ ప‌వ‌న్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

ఎంత‌టి జ‌టిల‌మైన స‌మ‌స్య తెలంగాణ రాష్ట్రానికి ఎదురైనా త‌న మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌కు సాంత్వన చేకూర్చ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని ప‌వన్ చెప్పారు. కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌యాణం, తెలంగాణ సాధ‌న‌లో ఆయ‌న‌దైన పోరాటం కేసీఆర్‌ను తెలంగాణ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలుపుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నానని తెలుపుతూ ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

           
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
KCR

More Telugu News