YS Sharmila: వైయస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పీఎస్ లో కూడా ధర్నాకు దిగిన వైనం!

YS Sharmila arrested
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, జాబ్ నోటిఫికేషన్ గురించి వైయస్సార్టీపీ అధ్యక్షురాలు తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు హైదరాబాదులోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆమె ధర్నాకు దిగారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగభృతిని అమలు చేయాలంటూ టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం ధర్నాకు దిగారు. ఉద్యోగాలు ఇవ్వని ఈ సీఎం మనకు వద్దని నినాదాలు చేశారు. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె ధర్నాకు దిగారు.
Go Back to Shorts
YS Sharmila
YSRTP
Arrest

More Telugu News