'అప్పుడే 17 ఏళ్లా!.. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎన్ఎస్జీ' అంటూ శ్రీమతికి మహేశ్ విషెస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అప్పుడే 17 ఏళ్లా!.. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎన్ఎస్జీ' అంటూ శ్రీమతికి మహేశ్ విషెస్

So Easily 17 Years Mahesh Wishes His wife Happy Anniversary Saying NSG
  • ఇవాళ మహేశ్ బాబు వివాహ వార్షికోత్సవం
  • భార్యాపిల్లలతో కలిసి ఉన్న ఫొటో పోస్ట్
  • ప్రేమతో మరెన్నో ఇలాంటివి జరుపుకోవాలంటూ ట్వీట్
ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మే 12న సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు మహేశ్. అయితే, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఆయన సమయం కేటాయిస్తుంటారు. వారితో కలిసి సరదాగా గడుపుతారు.

ఇదిలావుంచితే, ఇవాళ మహేశ్ బాబు వివాహ వార్షికోత్సవం. 17వ పెళ్లి రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా భార్యాపిల్లల ఫొటోను పోస్ట్ చేసి తన శ్రీమతికి స్పెషల్ గా విషెస్ చెప్పారాయన. ఎన్ఎస్జీ అంటూ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘అప్పుడే 17 ఏళ్లు గడిచిపోయాయా? పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎన్ఎస్జీ. ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో మనం జరుపుకోవాలి. అంతా ప్రేమ నిండాలి’’ అని మహేశ్ ట్వీట్ చేశారు.

సితార, గౌతమ్, నమ్రతతో కలిసి ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ఇంతకీ 'ఎన్ఎస్జీ' అంటే మహేశ్ భార్య 'నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని'కి షార్ట్ ఫాం.
Mahesh Babu
NSG
Tollywood

More Telugu News