బుర్జ్ ఖ‌లీఫాపై నుంచి కింది వ‌ర‌కు బైక్‌పై మ‌హేశ్ బాబు.. అల‌రిస్తోన్న కొత్త యాడ్ వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుర్జ్ ఖ‌లీఫాపై నుంచి కింది వ‌ర‌కు బైక్‌పై మ‌హేశ్ బాబు.. అల‌రిస్తోన్న కొత్త యాడ్ వీడియో ఇదిగో

On top of the world says mahesh
  • 'ఆనందంలో మునిగితేలుతున్నా' అంటూ మ‌హేశ్ పోస్ట్
  • డ్యూ కూల్ డ్రింక్ ప్ర‌చార‌క‌ర్త‌గా మ‌హేశ్
  • భ‌యానికి భ‌య‌ప‌డితే ఏ సాహ‌స‌మూ చేయ‌లేమ‌ని సందేశం
'ఆనందంలో మునిగితేలుతున్నా' అంటూ కొత్త యాడ్ వీడియో పోస్ట్ చేశాడు మ‌హేశ్ బాబు. గ‌తంలో థ‌మ్స‌ప్ యాడ్‌లో ఇర‌గ‌దీసిన మ‌హేశ్ బాబు ఇప్పుడు డ్యూ కూల్ డ్రింక్‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా మారాడు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. డ్యూతో క‌లిసి తాను గొప్ప సాహ‌స కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాన‌ని పేర్కొన్నాడు.

బుర్జ్ ఖ‌లీఫాపై నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ చేయ‌ని సాహ‌సం చేసినట్లు మ‌హేశ్ బాబు ఇందులో న‌టించాడు. బుర్జ్ ఖ‌లీఫాపై నుంచి కింది వ‌ర‌కు బైక్‌పై వ‌చ్చిన‌ట్లు ఈ యాడ్ ఉంది. హాలీవుడ్ రేంజ్‌లో దీన్ని రూపొందించారు. భ‌యానికి భ‌య‌ప‌డితే ఏ సాహ‌స‌మూ చేయ‌లేమ‌ని మ‌హేశ్ సందేశం ఇచ్చాడు.
Mahesh Babu
Tollywood
Viral Videos

More Telugu News