చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం.. హైకోర్టులో సవాలు చేసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు
- వందేళ్లుగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు
- వేలాదిమంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు
- ఇప్పుడు వారంతా రోడ్డున పడతారు
- ఆ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలన్న రఘురామ
చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో7ను రద్దు చేయాలని ఆ వ్యాజ్యంలో కోరారు. వందేళ్లకుపైగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని, దీనిపై ఆధారపడి వేలాదిమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పుడీ నాటక ప్రదర్శనను నిలిపివేయడం ద్వారా వారంతా రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటకంలోని ఓ పాత్ర కారణంగా మొత్తం నాటక ప్రదర్శననే నిషేధించడం సరికాదన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అనాలోచిత చర్య అని, వెంటనే ఈ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని రఘురామ రాజు ఆ పిల్‌లో పేర్కొన్నారు.