ఎక్కడ అత్యాచారం జరిగినా వైసీపీ నేతల హస్తం ఉంటోంది: టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత
- మైనర్ బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతుండటం దారుణం
- సుచరిత నిస్సహాయశాఖ మంత్రిగా మారిపోయారు
- బలహీనవర్గాల మహిళలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు
రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా వైసీపీ నేతల హస్తం ఉంటోందని అనిత ఆరోపించారు. అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు వస్తే... అక్కడ ఆ అమ్మాయి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని పోలీసులను కోరుతున్నామని చెప్పారు.
బలహీనవర్గాలకు చెందిన మహిళలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకపోయినా డ్రగ్స్, గంజాయి మాత్రం వచ్చాయని అన్నారు. జగన్ కు మహిళలు బుద్ధి చెప్పే సమయం త్వరలోనే వస్తుందని చెప్పారు.