ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినంత మాత్రాన ఆ సామాజికవర్గ ఓట్లు వైసీపీకి పడతాయా?: రఘురామకృష్ణరాజు
- ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టొచ్చు కదా?
- జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని జగన్ ఏకపక్షంగా తీసుకున్నారు
- సజ్జల తీరును వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా అసహ్యించుకుంటున్నారన్న రఘురాజు
ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. ఏ అర్హత లేని సజ్జలకు ఉద్యోగ సంఘాలను బెదిరించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాని సజ్జల అన్నీ తానై వ్యవహరిస్తూ.. తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలపై పెత్తనం చెలాయిస్తున్నాడని దుయ్యబట్టారు.
పరిధికి మించి సజ్జల వ్యవహరిస్తుండటంపై తమ పార్టీలోని ప్రజాప్రతినిధులు సైతం అసహ్యించుకుంటున్నారని అన్నారు. 'నేను ఉన్నాను, నేను విన్నాను' అని మాత్రమే తమ ముఖ్యమంత్రి జగన్ చెప్పారని... 'సజ్జల ఉన్నాడు, సజ్జల వింటాడు, సజ్జల చేస్తాడు' అని ఎప్పుడూ చెప్పలేదని సెటైర్ వేశారు.