ఈ ఫొటోకు క్యాప్షన్ చెప్పండి.. లక్షరూపాయలు అందుకోండి: రాంగోపాల్ వర్మ ఆఫర్

28-01-2022 Fri 07:10
  • పబ్‌లో తీసిన వీడియోలు పోస్ట్
  • సిగరెట్, మద్యం తాగుతూ అమ్మాయిలతో చిందులు
  • ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతున్న వీడియో
RGV announce one lakh rupees to who say caption to this photo
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన ట్వీట్లు బోల్డంత చర్చకు కారణమవుతుంటాయి. తాజాగా వర్మ షేర్ చేసిన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ పబ్‌లో అమ్మాయిలతో ఉన్న వీడియోలు ఇవి. వారితో కలిసి సిగరెట్ తాగుతూ చిందులేస్తున్నాడు.

మరో వీడియోలో ఒక చేతిలో మందు బాటిల్‌ పట్టుకుని మరో చేతితో అమ్మాయిని గట్టిగా హత్తుకున్నాడు. దీంతో పాటు మరో ఫొటోను షేర్ చేస్తూ దానికి క్యాప్షన్ చెబితే లక్షరూపాయలు ఇస్తానని పేర్కొన్నాడు. వర్మ షేర్ చేసిన ఈ వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లో రచ్చ చేస్తున్నాయి.