ఆ ఇద్దరి వల్లే నేనింకా బతికున్నా: సమంత

Samantha Says She Still Alive Because Of These Two Trainers In Skiing
  • స్విట్జర్లాండ్ టూర్ లో హీరోయిన్
  • స్కీయింగ్ చేస్తూ మంచు అందాల ఆస్వాదన
  • ట్రైనర్ల గురించి చెప్పుకొచ్చిన సమంత
  • ఓ భావోద్వేగ సందేశం పోస్ట్
ఇటీవలి కాలంలో సమంత జోరు పెంచేసింది. వరుస సినిమాలు చేస్తోంది. ఈమధ్యే విడుదలైన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. అయితే, సమయం దొరికినప్పుల్లా సామ్ విహార యాత్రలకు వెళ్తుంటుంది. చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఆమె తన స్నేహితురాలితో కలిసి బద్రీనాథ్ తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె స్విట్జర్లాండ్ టూర్ లో ఉంది. అక్కడ తెల్లటి మంచు అందాలను ఆస్వాదిస్తోంది. ఆ మంచులో సాహసక్రీడల్లో పాల్గొంటోంది. స్కీయింగ్ చేస్తూ ఉల్లాసంగా కాలాన్ని గడుపుతోంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో సామ్ పంచుకుంది. తానింకా బతికున్నానంటే కారణం ఆ ఇద్దరేనంటూ స్కీయింగ్ శిక్షకులు ఆంటోనీ, కేట్ మెక్ బ్రైడ్ లను ఆమె ట్యాగ్ చేసింది. ‘స్కీయింగ్ అంటే నమ్మకం’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.


‘‘స్కీయింగ్ అంటే ఎంతో సాహసోపేతమైనది. అంత సులభం కాదు. అయినా చాలా బాగుంది’’ అని సమంత పేర్కొంది. ఆమె సాహసాన్ని చూసి ప్రముఖులు, నెటిజన్లు అబ్బురపడిపోతున్నారు. ‘‘నువ్వు అనుకున్నది సాధించే సాహసవంతురాలివి. ఏదైనా పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించి తీసుకురా’’ అంటూ సింగర్ చిన్మయి సమంత పోస్ట్ కు రిప్లై ఇచ్చింది.  

ఇక దాంతో పాటు స్కీయింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఓ సందేశాన్నీ సమంత ఇచ్చింది. ‘‘నాకు ఇంకో చాన్స్ ఇవ్వు. ఎండలో నీడలా ఉండు. అంతా మంచి కాలాన్నివ్వు. ఈ ప్రపంచం ఆది నుంచీ నడుస్తోందని నాకు చెప్పు. అంతా మంచే జరుగుతుందన్న ధీమాని ఇవ్వు. ఎండలో నీడలా ఉండు’’ అంటూ రాసుకొచ్చింది.
Go Back to Shorts
Samantha
Tollywood
Switzerland
Skiing

More Telugu News