విడాకుల ప్రకటనను డిలీట్ చేసిన సమంత
- మళ్లీ కలుస్తారా? అంటూ నెటిజన్ల ప్రశ్నలు
- ఆ ప్రకటనను డిలీట్ చేయని నాగ చైతన్య
- ఇప్పటికే చైతూ ఫొటోలు డిలీట్ చేసిన సామ్
దీనిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమంత, నాగ చైతన్య మళ్లీ కలిసిపోతున్నారా? అన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే, నాగ చైతన్య మాత్రం ఆ పోస్టును డిలీట్ చేయలేదు. ఇప్పటికే సమంత తన సామాజిక మాధ్యమాల నుంచి చైతూ ఫొటోలను డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే విడాకుల ప్రకటనను కూడా తొలగించి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఆ ప్రకటన చేసి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఇక ఆ పోస్టు అవసరం లేదని భావించి సమంత దాన్ని డిలీట్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. సమంత-నాగ చైతన్య తిరిగి కలిసే అవకాశమూ లేదని పలువురు అంటున్నారు. కాగా, సమంత వరుసగా కొత్త ప్రాజక్టులకు ఓకే చెబుతూ బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఐటం సాంగ్‌కు కూడా చేసి అందరినీ మెప్పించింది. మరోపక్క, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమా భారీగా వసూళ్లు రాబడుతోన్న విషయం తెలిసిందే.