అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన జూనియర్లు
- 233 పరుగుల ఛేదనలో తడబడిన ప్రొటీస్ జూనియర్స్
- 187 పరుగులకే ఆలౌట్
- 5 వికెట్లతో నడ్డివిరిచిన ఓస్వాల్
233 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. 187 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బ్రూయిస్ (65) టాప్ స్కోరర్. కిటిమి 25 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో విక్కీ ఓస్వాల్ 5 వికెట్లు పడగొట్టి.. దక్షిణాఫ్రికా నడ్డి విరిచాడు. రాజ్ బజ్వా నాలుగు వికెట్లు తీశాడు. ఈ విజయంతో గ్రూప్ సీలో ఉన్న టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.