ఈ వీడియోను ఇప్పటివరకు 1000 కోట్ల సార్లు చూశారు... ఇంతకీ వీడియోలో ఏముందంటే...?
- యూట్యూబ్ రారాజుగా బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో
- వీడియోను పోస్టు చేసిన పింక్ ఫాంగ్ చానల్
- ఈ వీడియోకు 3.2 కోట్ల లైకులు
- చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్న వీడియో
అదొక పిల్లల మ్యూజిక్ వీడియో. 'బేబీ షార్క్ డ్యాన్స్' అనే ఆ వీడియోలో కొందరు చిన్నారులు, పలు యానిమేషన్ బొమ్మలు హుషారైన పెర్ఫార్మెన్స్ తో అలరించడం చూడొచ్చు. ఈ వీడియో నిడివి 2 నిమిషాలకు పైనే ఉంటుంది. 'పింక్ ఫాంగ్' అనే యూట్యూబ్ చానల్లో పోస్టు చేసిన ఈ 'బేబీ షార్క్ డ్యాన్స్' వీడియోను ఇప్పటివరకు 1000,89,32,715 సార్లు చూశారు.
ఈ వీడియోకు 3.2 కోట్ల లైకులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో ఈ పాటకు విశేషమైన క్రేజ్ ఉంది. ఇందులో పెద్దగా సాహిత్యం లేకపోయినా, పాట ఎంతో లయబద్ధంగా సాగుతుంది.