Cricket: అద్భుతమైన రీతిలో క్యాచ్ ప‌ట్టిన న్యూజిలాండ్ కెప్టెన్.. వీడియో ఇదిగో

latham catches ball
షార్ట్స్‌లో చూడండి
న్యూజిలాండ్ కెప్టెన్‌ టామ్ లాథమ్ తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా, అద్భుతమైన రీతిలో క్యాచ్ ప‌ట్టి ఔరా అనిపించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండో ఇన్సింగ్స్‌లో 37వ ఓవర్ లో బౌల‌ర్ టిమ్ సౌథీ బంతి వేయ‌గా దాన్ని మొహమ్మద్ నయీమ్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

దీంతో ఆ బంతి బ్యాట్‌కు త‌గిలి స్లిప్స్‌ దిశగా వెళ్లడంతో థర్డ్‌ స్లిప్‌లో ఉన్న లాథమ్ డైవ్‌ చేస్తూ ఎడ‌మ చేతితో దాన్ని ప‌ట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఇటువంటి అద్భుత‌మైన క్యాచ్ తాము ఎన్న‌డూ చూడ‌లేదంటూ నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. కాగా, ఈ టెస్టులో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించి, రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.  
Go Back to Shorts
Cricket
Viral Videos

More Telugu News