Allu Arjun: 'పుష్ప' నుంచి 'ఊ అంటావా మావా' ఫుల్ సాంగ్ ఇదిగో... చూసేయండి!

  • 'పుష్ప'గా అల్లు అర్జున్
  • దర్శకుడిగా సుకుమార్  
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • సమంత ఐటమ్ హైలైట్
Pushpa oo antava full song released

అల్లు అర్జున్ - రష్మిక కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా క్రితం నెలలో 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను మంచి వసూళ్లను రాబట్టింది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ - సమంత కాంబినేషన్ పై చిత్రీకరించిన 'ఊ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్ కి మాస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

చంద్రబోస్ అందించిన సాహిత్యం .. ఇంద్రావతి ఆలాపన .. గణేశ్ ఆచార్య కొరియో గ్రఫీ ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే.

More Telugu News