Revanth Reddy: కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్‌లోనా.. ఫాంహౌస్‌లోనా?: రేవంత్ రెడ్డి

revant reddy slams  kcr
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ‌లో ఇటీవ‌ల ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌లో నిందితుడు వ‌న‌మా రాఘ‌వ వ్య‌వ‌హారంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కీచక రాఘవ ఎక్కడ? అని ఆయ‌న నిల‌దీశారు. రాఘ‌వ ప్ర‌స్తుతం ప్రగతి భవన్ లో ఉన్నాడా?.. ఫాంహౌస్ లో ఉన్నాడా? అంటూ ప్ర‌శ్నించారు.

అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్టు చేసిన పోలీసులు మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం ఏమిటి? అని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. దుర్మార్గుడిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఏంట‌ని ప్ర‌శ్నించారు. దారుణ ఘటన పై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటని ఆయ‌న నిల‌దీశారు.

కాగా, రాఘ‌వను ఇప్ప‌టికీ అరెస్టు చేయ‌క‌పోవ‌డంపై పలు పార్టీల నేత‌లు తెలంగాణ స‌ర్కారుపై మండిప‌డుతున్నారు. రాజ‌కీయ బ‌లం ఉన్నంత మాత్రాన నిందితులు త‌ప్పించుకునేందుకు అవ‌కాశం ఇస్తారా? అని నిల‌దీస్తున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR

More Telugu News