ఆశావర్కర్లకు సంక్రాంతి సందర్భంగా శుభవార్తను చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- నెలవారీ ప్రోత్సాహకాలను పెంచిన ప్రభుత్వం
- గత జూన్ నెల నుంచి పెరిగిన ఇన్సెంటివ్ లను అమలు చేయనున్నట్టు ప్రకటన
- హర్షం వ్యక్తం చేస్తున్న ఆశా వర్కర్లు
ప్రోత్సాహకాలు పెరుగుతుండటంలో వారి నెలవారీ జీతాలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న రూ. 7,500 జీతం రూ. 9,750కి పెరగనుంది. గత ఏడాది జూన్ నెల నుంచి పెరిగిన ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.