12 ఏళ్ల లోపు చిన్నారులకు రేపు ఉచిత ప్రయాణం.. టీఎస్ఆర్టీసీ బంపరాఫర్!

12 ఏళ్ల లోపు చిన్నారులకు రేపు ఉచిత ప్రయాణం.. టీఎస్ఆర్టీసీ బంపరాఫర్!

TSRTC offer to children to journey free in their busses free on january 1st
  • నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సజ్జనార్ ఉత్తర్వులు
  • రాష్ట్రంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
చిన్నారులకు టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 12 ఏళ్లలోపు పిల్లలందరికీ రేపు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆఫర్ 12 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రమే వర్తిస్తుందని, వారు రేపు రాష్ట్రంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే వారి నుంచి టికెట్ చార్జీలు వసూలు చేయబోమన్నారు. ఈ ఆఫర్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సజ్జనార్ కోరారు.
TSRTC
New Year 2022
Children
Free Journey
Telangana

More Telugu News